- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా పంతులు మాకే కావాలి..
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో ఉన్న జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్యన కొంత అంతర్గత వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో ఉన్న జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్యన కొంత అంతర్గత వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాఠశాల హెచ్ఎం జీవన్ కుమారును వెల్టూరు హైస్కూల్ కు ఇన్చార్జి హెచ్ఎం గా, మరో ఉపాధ్యాయురాలిని అచ్చంపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలకు గత వారం రోజుల క్రితం బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు మా హెచ్ఎం మాకే కావాలని అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆ విషయం ఎంఈఓ దృష్టికి వెళ్లడంతో వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించే విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న విద్యార్థుల వద్దకు పోలీసులు చేరుకొని విద్యార్థులకు సర్ది చెప్పి నిరసన లేకుండా చర్యలు తీసుకున్నారు.






