- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంసృతి, సాంప్రదాయాలు పాటిస్తూ పోలీస్ సేవలందిస్తున్నాం
by Elthuri vijay kumar |
బతుకమ్మ పండుగ సంసృతి, సాంప్రదాయాలు పాటిస్తూ, పోలీస్ శాఖ నుండి ప్రజలకు విస్తృత సేవలను అందిస్తున్నామని జిల్లా ఎస్పీ జానకి అన్నారు.

X
సంసృతి, సాంప్రదాయాలు పాటిస్తూ పోలీస్ సేవలందిస్తున్నాం
-జిల్లా ఎస్పీ జానకి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: బతుకమ్మ పండుగ సంసృతి, సాంప్రదాయాలు పాటిస్తూ, పోలీస్ శాఖ నుండి ప్రజలకు విస్తృత సేవలను అందిస్తున్నామని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో ఎస్పీ జానకి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు బతుకమ్మ పాటల్లో ఆస్వాదించ వచ్చని ఆమె అన్నారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందని, బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని ఆత్మీయతను పెంపొందించుకుంటూ, సాంస్కృతిక విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ అధికారులు, పోలీసులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందంగా జరుపుకున్నారు.
Next Story






