దేశాన్ని నాశ‌నం చేసే శ‌క్తుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి : వసంతం వెంకటేశ్వర్లు

by Nallavelli.Anjaneyulu |

దిశ, మక్తల్ : దేశాన్ని అస్థిర ప‌రిచేందుకు విదేశీ అందుకుంటున్న మ‌త‌త్వ కుహ‌న శ‌క్తులు టెర్ర‌రిస్టులు, న‌క్స‌లైట్లు, మ‌త మార్పిడిలు చేసే వారి ప‌ట్ల

దేశాన్ని నాశ‌నం చేసే శ‌క్తుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి : వసంతం వెంకటేశ్వర్లు
X

దిశ, మక్తల్ : దేశాన్ని అస్థిర ప‌రిచేందుకు విదేశీ అందుకుంటున్న మ‌త‌త్వ కుహ‌న శ‌క్తులు టెర్ర‌రిస్టులు, న‌క్స‌లైట్లు, మ‌త మార్పిడిలు చేసే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పాలమూరు జిల్లా సంఘ చాలకులు మాననీయ వసంతం వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్ఎస్ఎస్ ఏర్ప‌డి 100 సంవ‌త్స‌రాల ఉత్స‌వాల్లో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ మ‌త శ‌క్తులు దేశాన్ని ముక్క‌లుగా చేయాల‌ని చూస్తున్నాయ‌ని.. వారికి అడ్డుక‌ట్ట వేసేందుకే ఆప‌రేష‌న్ సింధూర్ ని కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌ని తెలిపారు. ఆర్ఎస్ఎస్ దేశ‌వ్యాప్తంగా వ్య‌క్తి నిర్మాణ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని తెలిపారు. ఎంతో మంది యువ‌కుల‌ను దేశ భ‌క్తులుగా త‌యారు చేసింద‌న్నారు. 100 ఏళ్ల ప్ర‌యాణంలో ఆర్ఎస్ఎస్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంద‌ని తెలిపారు.


దేశంలో ఎక్కడ ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నిస్వార్థంగా సేవలు అందిస్తారని తెలిపారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పని చేస్తుందని చెప్పారు. దేశాభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు కొండయ్య, డాక్టర్ గరిడి అనిల్ కుమార్. గవినోల బలరాం రెడ్డి, స్వయం సేవకులు.పాల్గోన్నారు.

Next Story