ఈ కాలుష్యం ఫ్యాక్టరీ మాకు వద్దు...!

by Ratna Kumari |   (  Updated:2025-10-22 14:57:39  IST  )

దిశ, జడ్చర్ల : వీ బోర్ స్టీల్ ట్యూబ్ త‌యారీ ఫ్యాక్ట‌రీ వ్యర్థాల‌తో కాలుష్యం వెద‌జ‌ల్లుతోంది. వ్య‌ర్థ కాలుష్యంతో ఇటు ప్ర‌జ‌లు రోగాల బారిన పడటంతోపాటు అటు మూగజీవాల

ఈ కాలుష్యం ఫ్యాక్టరీ మాకు వద్దు...!
X

దిశ, జడ్చర్ల : వీ బోర్ స్టీల్ ట్యూబ్ త‌యారీ ఫ్యాక్ట‌రీ వ్యర్థాల‌తో కాలుష్యం వెద‌జ‌ల్లుతోంది. వ్య‌ర్థ కాలుష్యంతో ఇటు ప్ర‌జ‌లు రోగాల బారిన పడటంతోపాటు అటు మూగజీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని బోరుబావిలో నుంచి కాలుష్యత్తు నీరు వచ్చి పంటలు పండడం లేదని ఈ కాలుష్యపు ఫ్యాక్టరీ మాకొద్దు అంటూ ఈ ఫ్యాక్టరీ ఆక్రమణకు చూస్తున్న 1.08 గుంటల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని బుధవారం బాలనగర్ తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఉడిత్యాల శివారులోని ఈదమ్మ గడ్డ తండా ప్రజలు మండల పరిధిలోని ఉడిత్యల గ్రామ శివారులోని ఈదమగడ్డ తండా పరిధిలో వి బోర్ స్టీల్ ట్యూబ్ పరిశ్రమ ఏర్పాటు చేశారని ఈ పరిశ్రమ ఏర్పాటు చేసిన నాటి నుండి వ్యర్థ కాలుష్యపు జలాలు పరిసర ప్రాంతాల్లో బోరు వేసి బోరు ద్వారా భూగర్భంలోకి వదులుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. పరిశ్రమ చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో ఎక్కడ బోరు మోటారు ఆన్ చేసిన సుమారు గంటపాటు ఎర్రని రంగు మారిన కాలుష్యపు నీరు వస్తున్నాయని దీంతో దాదాపు 200 ఎకరాల భూమి సాగుకు ఉపయోగపడకుండా పోయిందని.. దీంతోపాటు వాయు కాలుష్యం అధికంగా వదులుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇదమ్మ గడ్డ తండా ప్రజలు నిత్యం అనారోగ్యాల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు.

దీంతోపాటు గతంలో చుట్టుపక్క గ్రామాల్లోని రైతుల పాడి ప్రసవులు సుమారు 50 వరకు మృత్యువాత పడ్డారు. గతంలో జిల్లా అధికారులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేసిన నమ మాత్రం కష్టాలు తీసుకొని ఇప్పటివరకు కూడా ఎలాంటి రిపోర్టులు ఇవ్వలేదని వ్యర్థ జలాల నియంత్రణ ఖాళీ సేపు నియంత్రణకు చర్యలు చేపట్టలేదని రైతులు ఫిర్యాదుల పేర్కొన్నారు దీంతో పాటు పరిశ్రమ పక్కనే ఉన్న 514 సర్వే నెంబర్ లో 1.08 గుంటల ప్రభుత్వ భూమిని ఈ కంపెనీ ఆక్రమించేందుకు ఉడిత్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్ఓసీ కొరకు దరఖాస్తు చేయగా ఈ విషయాన్ని పంచాయతీ అధికారులు నోటీసు బోర్డు పై పెట్టారని ప్రభుత్వ భూమిని ప్రవేట్ కంపెనీకి ఎలా కట్టబెడతారని ప్రభుత్వ భూమి ప్రవేట్ కంపెనీకి కట్టబెడితే సహించేది లేదని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా మండల రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని లేదంటే ఈ అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఫిర్యాదుల పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నవి బోర్ స్టీల్ ట్యూబ్ పరిశ్రమను వెంటనే రద్దుచేసి గ్రామ శివారు నుంచి ఎత్తివేసి రోగాల బారిన పడకుండా ప్రజల ప్రాణాలను కాపాడడంతోపాటు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా మల్చాలని రైతులు ఫిర్యాదు లో పేర్కొన్నారు.

Next Story