ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం :ఎమ్మెల్యే

by Naveena |

ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం :ఎమ్మెల్యే
X

దిశ,చిన్నచింతకుంట: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని నెల్లికొండి గ్రామంలో రేషన్ దుకాణంలో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పేద ప్రజల కడుపు నింపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని. అప్పుల కుప్పగా మార్చారని, ప్రజా సంక్షేమాన్ని మరిచి అప్పటి ప్రజాప్రతినిధులు తమ ఆస్తులను పెంచుకున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం ఏ గ్రామంలోనైనా ఒక్క ఇల్లు కట్టించారా కనీసం రేషన్ కార్డు కూడా అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట కోట్ల రూపాయలను ఖర్చు చేసి, నిరుపేదలకు సొంతింటి కళను నెరవేరుస్తున్నామన్నారు. నెల్లికొండి గ్రామంలో 216 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి, మొత్తంగా 876 రేషన్ కార్డుల ద్వారా నిరుపేదలకు సన్నబియాన్ని అందిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం విద్య ,వైద్యానికి అధిక నిధులు కేటాయిస్తూ పెద్దపీట వేస్తున్నామన్నారు. మారుమూల గ్రామమైన దమగ్నాపూర్ లోని ఎర్రగుట్ట వద్దా 25 ఎకరాలలో 200 కోట్లు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా నిరుపేదల కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు .రేషన్ డీలర్లు సన్న బియ్యం పంపిణీలో పారదర్శకంగా పనిచేయాలని, ప్రభుత్వ నిబంధనలు మేరకు బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆయన రేషన్ డీలర్ల కు సూచించారు.

రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయం: ఎమ్మెల్యే జిఎంఆర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సమ్మిదాన్ కార్యక్రమంలో భాగంగా బండర్ పల్లి గ్రామంలో పురవీధుల గుండా పాదయాత్ర కొనసాగించారు. నెల్లికొండి గ్రామానికి రాగానే స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని గ్రామ పురవీధుల్లో రాజ్యాంగ పుస్తకాన్ని, అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల కు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించబడ్డాయన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మార్కెట్ చైర్మన్ కథలప్ప, విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, నాయకులు వట్టెం శివకుమార్ ,వెంకటేష్, జానకిరామ్, కృష్ణ కుమార్ రెడ్డి గోపాల్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి ,డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్, సివిల్ సప్లై డిటి అమీర్ ఖాన్, ఆర్ ఐ లు తిరుపతయ్య, అమీర్ తో పాటు ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story