- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఎల్బిసీ సొరంగంలో వేగంగా వస్తున్న వాటర్
శ్రీశైలం ఎడమ గట్టు నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట వద్ద ఎస్ఎల్బిసీ వద్ద సొరంగంలో చిక్కుకుపోయిన 7 మందిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ ఆపరేషన్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

దిశ, అచ్చంపేట : శ్రీశైలం ఎడమ గట్టు నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట వద్ద ఎస్ఎల్బిసీ వద్ద సొరంగంలో చిక్కుకుపోయిన 7 మందిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ ఆపరేషన్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13. 5 కిలోమీటర్ నుండి 14వ కిలోమీటర్ వరకు పెద్ద మొత్తంలో మట్టి దిబ్బలు పేర్కొని ఉండటంతో రెస్క్యూ బృందాల ఆపరేషన్ నెమ్మదిగా కొనసాగుతుంది. జి పి ఆర్ రాడర్ ద్వారా గుర్తించిన ప్రదేశాలలో కేరళకు చెందిన క్యాడ్ వార్ డాగ్స్ వాసన ద్వారా కొన్ని ప్రదేశాలను ఫైండ్ అవుట్ చేయడం వలన ఆ ప్రదేశాలలో మాత్రమే రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపడుతున్నాయి. ఆ క్రమంలో పెద్ద మొత్తంలో సిపిఎస్ వాటర్ దిగువ నుండి వస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు పూర్తిగా విగాథం కలుగుతుందని రెస్క్యూ బృందాలు, సహాయకచెల్లలు పర్యవేక్షిస్తున్న అధికారులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సొరంగంలో వరద నీరు వేగంగా వస్తున్న నేపథ్యంలో 13. 8 కిలోమీటర్ల నుండి ఆ పైభాగం వరకు 15 మీటర్లకు పైగా సొరంగంలో మట్టి దిబ్బలు ఉండడం వలన సహాయక చర్యలు కు ఆటంకం కలుగుతుంది.
ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్న ఒక రోబో...
గత రెండు రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాలతో రోబో మోనిటరింగ్ ద్వారా సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆ వైపుగా చర్యలు చేపట్టారు. ఆరు మంది అన్వి రోబో బృందం సొరంగం అంతర్భాగంలో మాస్టర్ రోబో ద్వారా ఆపరేటింగ్ చేసే విధానంపై అధ్యయనం చేశారు. కానీ సొరంగంలో వెళ్లి పనిచేసే విభిన్న కోణాలలో సహాయక చర్యలు అందించే 3 రోబోలు బుధవారం ఉదయం వరకు వస్తాయని ఆశించిన అధికార యంత్రంగానికి.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎస్ఎల్బీసీ వద్దకు ఒక్క రోబో చేరుకున్నది. అందుకు సమంతి రిస్క్ బృందాలతో పాటు రోబో మానిటరింగ్ నిపుణులు రాట్ హోల్ మైనస్ లోకో ట్రైన్ ద్వారా సొరంగంలోకి వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ సొరంగంలో వివిధ సాంకేతిక కారణాల వలన సహాయక చర్యలు నెమ్మదిగానే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్ లతో సహాయక చర్యలను ఉన్నతాధికారులతో సమీక్షిస్తూన్నారు.






