- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వింత ఘటన... బోరు బావిలో నుంచి ఉబికి వస్తున్న నీరు
by velandi.Saikiran |
చిన్న ఆముదాలపాడులో వింత ఘటన జరిగింది. బోరు బావి నుంచి ఎలాంటి మోటార్ లేకున్నా నీరు ఉబికి వస్తున్న వింత ఘటన చోటు

X
దిశ, ఉండవెల్లి: చిన్న ఆముదాలపాడులో వింత ఘటన జరిగింది. బోరు బావి నుంచి ఎలాంటి మోటార్ లేకున్నా నీరు ఉబికి వస్తున్న వింత ఘటన చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో గ్రామానికి చెందిన మునిస్వామి అనే రైతు తన వ్యవసాయ పొలంలో బోరు వేశాడు కానీ నీళ్లు రాలేదు. నీరు పడకపోవడంతో బోరు బావిని అలాగే వదిలేశాడు. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూగర్భజలాలు పెరగడంతో ఎలాంటి మోటార్ లేకున్నా ఇప్పుడు బోరు బావి నుంచి నీరు ఉబికి వస్తోంది. దింతో ఈ సంఘటన చూసేందుకు జనాలు వస్తున్నారు. అటు రైతు మునిస్వామి హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
Next Story






