- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థులకు హెచ్చరిక
by Ratna Kumari |
దిశ, అచ్చంపేట : స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం చిట్లంకుంట గ్రామపంచాయతీ పరిధి ఆమ్లెట్ విలేజ్ అయినా పెట్రల్ చేన్ గ్రామానికి

X
దిశ, అచ్చంపేట : స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం చిట్లంకుంట గ్రామపంచాయతీ పరిధి ఆమ్లెట్ విలేజ్ అయినా పెట్రల్ చేన్ గ్రామానికి చెందిన ఆదివాసీలు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన అంశాన్ని సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసే అభ్యర్థులు దయచేసి మా ఆదివాసీలకు మద్యం భోజనం లాంటి వ్యాపకాలతో ప్రచారంలో వాడుకొని తాగుడుకు బానిస చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఓటు కోసం ఖర్చు చేయాలనుకుంటే మా గ్రామంలో మీ పేరున ఏదైనా అభివృద్ధి పని చేయాలని సూచించారు. అభ్యర్థులు గెలిచినా ఓడినా మీ పేరు స్థిరంగా ఉంటుందని సూచిస్తూ మద్యానికి డబ్బులకు బానిసలు చేయాలంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Next Story






