నాలుగు రోజులు వార్డు స‌భలు ప‌క‌డ్బందీగా నిర్వ‌హిస్తాం : క‌మిష‌న‌ర్ రామాంజులరెడ్డి

by Ratna Kumari |   (  Updated:2026-06-03 13:38:42  IST  )

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్(వార్డు) లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజుల రెడ్డి తెలిపారు.

నాలుగు రోజులు వార్డు స‌భలు ప‌క‌డ్బందీగా నిర్వ‌హిస్తాం :  క‌మిష‌న‌ర్ రామాంజులరెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్(వార్డు) లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజుల రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని ఆయన తన ఛాంబర్లో 'దిశ' తో మాట్లాడారు. ఆయా తేదిలోని ఈ నాలుగు రోజులు పట్టణంలోని 60 డివిజన్లలో సాలిడ్ వేస్ట్ (తడి, పొడి చెత్త, శానిటరీ వ్యర్ధాలను వేరువేర్వు చేయడం), వర్షపు నీటి ని వినియోగించి భూగర్భ జలాలు పెరిగేలా చేయడం లాంటివి, అలాగే ప్రత్యేక శానిటేషన్ లో భాగంగా మురుగునీటి కాల్వ లు, రోడ్లు, ఫుట్ పాత్, నాలా ల శుభ్రత లాంటివి, త్రాగునీటి సమస్య, రోడ్లు, వీధిలైట్లు, పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మొక్కలు నాటడం, 'సర్' లో భాగంగా ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటరు నమోదు, స్వీయ గణనలపై అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయా డివిజన్ కార్పోరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక సభల్లో వార్డు ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, మున్సిపాల్టీ, విద్యుత్ శాఖ, పోలీస్, రెవెన్యూ, హౌసింగ్, మెప్మా నుండి ఆర్పీ, ఇలా ఆయా శాఖల నుంచి ఒకొక్కరు పాల్గొంటారని, ప్రజలు తమ తమ డివిజన్ లోని సమస్యలను ఈ సభ ల దృష్టికి తేవచ్చని కమిషనర్ రామాంజుల రెడ్డి పేర్కొన్నారు.

Next Story