- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ భర్త పై ఎంపీడీఓ కు వార్డు మెంబరు ఫిర్యాదు
గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు సర్పంచ్ శివమ్మ ఆమె భర్త భౌతిక దాడికి దిగారని వల్లభాపురం తండా 7వ వార్డు సభ్యుడు సభావాత్ సర్దార్ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.

దిశ, వీపనగండ్ల : గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు సర్పంచ్ శివమ్మ ఆమె భర్త భౌతిక దాడికి దిగారని వల్లభాపురం తండా 7వ వార్డు సభ్యుడు సభావాత్ సర్దార్ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా లెక్కలు అడిగితే అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడి చేశారని ఆయన ఆరోపించారు. సర్పంచ్ తన పదవి కోసం రూ.20 లక్షలు ఖర్చు చేశానని బహిరంగంగా చెప్పడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. వార్డు సభ్యుడిగా ఉన్నప్పటికీ కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వకుండా అవమానించారని పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియో సాక్ష్యాలను అధికారులకు సమర్పించిన సర్దార్ నాయక్, సర్పంచ్ ఆమె భర్త పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వల్లభాపూర్ తాండ సర్పంచ్ శివమ్మ వార్డు మెంబర్ సర్దార్ పై కూడా ఎంపీడీవో కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎంపీడీవో శ్రీనివాసులు స్పందిస్తూ పూర్తి విచారణ జరిపి నివేదిక ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






