- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోరెన్సిక్ రిపోర్టు కోసం వెయిటింగ్ : ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్
ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాక తదుపరి చర్యలు చేపడతామని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వెల్లడించారు.

దిశ, కందనూల్ : ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాక తదుపరి చర్యలు చేపడతామని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వెల్లడించారు. నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో మల్లన్న దేవస్థానం వద్ద జరిగిన సంఘటన పూర్వపరాలను ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. చిన్నారి మృతి సంఘటన పై ప్రస్తుతం అందిన రిపోర్టుల ప్రకారం.. ఎలాంటి ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ గాయాలు లేవని ధ్రువీకరణ అయినట్లు వెల్లడించారు. పూర్తి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందన్నారు. గణేష్ కుటుంబ సభ్యుల పై దాడి సంఘటనలో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న ఐదుగురిని పట్టుకునేందుకు టీమ్ లను రంగంలో దించినట్టు తెలిపారు. 31 వారాలకే ప్రీ మెచ్యూర్డ్ డెలివరీ (నెలలు నిండక ముందే కాన్పు)లో పుట్టిన చిన్నారి, అనారోగ్యంతో హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్లో 30 రోజులు చికిత్స పొందినట్లు ఇప్పటి వరకు తాము చేసిన దర్యాప్తులో ఆధారాలు లభించినట్లు తెలిపారు. పాప మృతికి గల కారణాలు వెల్లడైన తర్వాత తగు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. జాతర లో జరిగిన సంఘటన పై పూర్తి విచారణ చేపట్టేందుకు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. సంఘటన విచారణకు బాధ్యత కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించారని కోరారు. ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్టుమార్టం రిపోర్ట్ లో చిన్న ఆధారం దొరికినా హత్య కేసు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు ఉన్నారు.






