- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటర్ల అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
దిశ, వనపర్తి : ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, ఓటర్ల తొలగింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్

దిశ, వనపర్తి : ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, ఓటర్ల తొలగింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. గురువారం తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎన్నికల విభాగం అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వంద సంవత్సరాలు పై బడిన ఓటర్ల జాబితాను సవరించి, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించాలనీ సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్ ఐడి కార్డులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, శ్రావ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.






