- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షేత్రస్థాయిలో ఈనెల 25 నుండి ఓటర్ల మ్యాపింగ్..
మండల కేంద్రంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన ఓటర్ లిస్టులను సరి చేయడం జరుగుతుందని నర్వ ఎమ్మార్వో మల్లారెడ్డి తెలియజేశారు.

దిశ, నర్వ: మండల కేంద్రంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన ఓటర్ లిస్టులను సరి చేయడం జరుగుతుందని నర్వ ఎమ్మార్వో మల్లారెడ్డి తెలియజేశారు. నర్వ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో పోలింగ్ స్టేషన్లో Blo సూపర్వైజర్ వీరేష్ బాబు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. నర్వ మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్‌లో హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఓటర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే నర్వ తాహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ నెంబర్ 9652035069 కు కాల్ చేసి వివరాలు పొందవచ్చని నర్వ ఎమ్మార్వో మల్లారెడ్డి తెలియజేశారు. ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఈనెల 25 నుంచి ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను బూతు లెవెల్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకు మరో మారు ఇంటింటా బి ఎల్ ఓ లు పారాలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో అంతర్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి రెండు చోట్ల ఓట్లు డబుల్ ఉండేవి ప్రస్తుతం ఇట్టి ఓట్లు ఒకే చోట ఒకే వ్యక్తికి ఓటు హక్కు కల్పించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న ఓటర్ లిస్టు మొత్తం కనుమరుగై మరి కొత్త ఓటర్ జాబితా రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఓటు కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసి...
అందుకు ఏ గ్రామాల్లో ఎక్కడ నివసిస్తున్నారు. అక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు కృషి చేస్తున్నామని తెలియజేశారు. గతంలో ఒక వ్యక్తికి ఒకే జిల్లాలో రెండు చోట్ల వివిధ రాష్ట్రాల్లో మరోచోట ఓటు ఉండేది కొందరు చనిపోయిన ఓట్లు వరుస క్రమంలో వస్తున్నాయి మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని మహిళలు ఇతర ప్రాంతాల్లో జీవిస్తున్నారు. వారికి కూడా రెండు చోట్ల ఓటు హక్కు ఉంటుందని పలువురు గ్రామాల్లోని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు అన్నారు. ఎన్నికల సమయంలో ఓటు కోసం వివిధ పార్టీల నాయకులు కుస్తీలు పట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందుకు ఏ వ్యక్తి ఏ ప్రాంతంలో ఏ గ్రామాల్లో నివసిస్తున్నారు .అదే చోట ఓటు కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసి ఒకే చోట ఓటు హక్కు ఉండే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. కొందరు స్వార్ధ రాజకీయాల కోసం ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వారికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండే విధంగా ప్రోత్సహించరాదని పలు గ్రామాల ప్రజలు తెలియజేయడం జరిగిందని నర్వ తాహసీల్దారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్వ తాహసీల్దార్ మల్లారెడ్డి, సూపర్వైజర్ శ్రీశైలం, ఆశా బేగం, ట్రైనింగ్ మాస్టర్ వీరేష్ బాబు, బాలరాజు, అంగన్వాడీ టీచర్స్ మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






