- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా సెనేట్ తీర్మానంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
సెనేట్ ఓటింగ్‌పై ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఫైర్.. "నా పనిని కష్టతరం చేశారు.. డెమొక్రాట్లతో చేతులు కలిపిన ఆ నలుగురు రిపబ్లికన్లూ లూజర్లే!"

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ పై అమెరికా చేస్తున్న సైనిక చర్యలపై సెనేట్ (Senate) కీలక తీర్మానం చేసి.. అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సెనేట్ నిర్ణయంపై అద్యక్షుడు ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇరాన్‌పై తన సైనిక అధికారాలను కట్టడి చేస్తూ అమెరికా సెనేట్ 'వార్ పవర్స్ యాక్ట్' తీర్మానాన్ని ఆమోదించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' వేదికగా సెనేట్ నిర్ణయాన్ని, దానికి మద్దతుగా ఓటేసిన నలుగురు రిపబ్లికన్ సొంత పార్టీ నేతలను ఆయన తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. తాను ఇరాన్‌ను పూర్తిగా కోలుకోలేని దెబ్బతీసి మన దారికి తెచ్చుకున్నానని, దశాబ్దాల తర్వాత మొదటిసారి వారు అమెరికాను, దేశ అధ్యక్షుడిగా తనను గౌరవిస్తున్న తరుణంలో సెనేట్ ఏ మాత్రం సమయం కాని సమయంలో ఈ అర్థం లేని ఓటింగ్‌ను నిర్వహించిందని ట్రంప్ మండిపడ్డారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ అయిన ఇరాన్‌కు అనుకూలంగా ఈ తీర్మానం చేయడం ద్వారా సెనేట్ నేరుగా శత్రువుకు మేలు చేసిందని ఆయన ఆరోపించారు.
ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచిన నలుగురు రిపబ్లికన్ సెనేటర్లను 'లూజర్లు'గా అభివర్ణించిన ట్రంప్, వారు ప్రతిపక్ష డెమొక్రాట్లతో చేతులు కలపడం వల్లే ఇరాన్ ఇప్పుడు తమ ప్రతినిధులను ఈ ఓటింగ్ అర్థం ఏంటని ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా దేశ అధ్యక్షుడిగా తన పనిని మరింత కష్టతరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాము అనుకున్న లక్ష్యాన్ని ఎలాగోలా పూర్తి చేస్తానని, ఎందుకంటే తాను ఎప్పుడైనా అనుకున్న పనిని సాధించి తీరుతానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లో ఇరాన్‌తో శాంతి చర్చలు ముగింపు దశకు వస్తున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.






