ఊట్కూర్ మండలంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పర్యటన

by Disha Web Desk 11 |
ఊట్కూర్  మండలంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పర్యటన
X

దిశ, ఊట్కూర్ : కొల్లూర్, నిడుగుర్తి, చిన్నపోర్ల గ్రామాలలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పర్యటించారు. కొల్లూర్ కుర్మ సంఘం కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేశారు. కుర్మ సోదరులకు కోరకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. నిడుగుర్తి గ్రామంలో రైతు వేదికను ప్రారంభించరు. రైతు వేదికను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. గొల్ల, కుర్మ, యాదవుల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చిన్నపొర్ల గ్రామంలో 12 యూనిట్ల సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్ గౌడ్, వైస్ ఎంపీపీ ఎల్లగౌడ్, సర్పంచ్లు యశోదమ్మ, రవీందర్ రెడ్డి, సరోజ, ఎంపీటీసీలు, అధికారులు బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు తదితులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed