అక్ర‌మ ఇసుక‌ను అడ్డుకున్న గ్రామ‌స్తులు

by Ratna Kumari |

సాధార‌ణంగా వారాంత‌పు సెల‌వులు ఉంటే చాలు.. అక్ర‌మ ఇసుక అక్ర‌మార్కుల‌కు పండుగ పండుతుంది. చీక‌టి ప‌డిందంటే వారు విచ్ఛ‌ల‌విడిగా కృష్ణాన‌ది నుంచి జేసీబీలు, ఇటాచీల‌తో టిప్ప‌ర్ల‌కు ట్రాక్ట‌ర్ల ను నింపి ఇసుక ను త‌ర‌లిస్తున్నారు.

అక్ర‌మ ఇసుక‌ను అడ్డుకున్న గ్రామ‌స్తులు
X

దిశ‌, మ‌క్త‌ల్ : సాధార‌ణంగా వారాంత‌పు సెల‌వులు ఉంటే చాలు.. అక్ర‌మ ఇసుక అక్ర‌మార్కుల‌కు పండుగ పండుతుంది. చీక‌టి ప‌డిందంటే వారు విచ్ఛ‌ల‌విడిగా కృష్ణాన‌ది నుంచి జేసీబీలు, ఇటాచీల‌తో టిప్ప‌ర్ల‌కు ట్రాక్ట‌ర్ల ను నింపి ఇసుక ను త‌ర‌లిస్తున్నారు. అక్ర‌మ ఇసుక ర‌వాణాను గ్రామ‌స్తులు అడ్డుకుంటే.. ఇసుక మాఫియా భౌతికంగా దాడి చేయ‌డానికి, వాహ‌నాల‌ను పైకి దూసుకెళ్లించేలా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. అప్ర‌మ‌త్తం కావ‌డంతో పెద్ద ప్ర‌మాదాలు త‌ప్పుతున్నాయ‌ని గ్రామస్తులు పేర్కొంటున్నారు. శ‌నివారం రాత్రి గురుజాల్ గ్రామం నుంచి సిద్ధిలింగ మఠం నుంచి కృష్ణ మండ‌ల కేంద్రం పోలీస్ స్టేష‌న్ కి ద‌రిదాపులో జ‌రుగుతుంది.


ఆల‌స్యంగా వెలుగులోకి రావ‌డం కృష్ణ మండ‌లంలో అక్ర‌మ ఇసుక పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇటీవ‌ల త‌హ‌శీల్దార్ వాగుల ద‌గ్గ‌ర న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ప్ర‌త్యేకంగా రెవెన్యూ సిబ్బందిని కాపులు ఏర్పాటు చేస్తున్నామ‌ని చెబుతున్నా రాత్రి పెద్ద మొత్తంలో జ‌రిగిన అక్ర‌మ ఇసుక ర‌వాణా వాహ‌నాల‌ను అడ్డుకునే వారు కనిపించ‌డం లేదంటున్నారు. గుజ‌రాల నుంచి అక్ర‌మ ఇసుక ర‌వాణా వాహ‌నాల‌ను గ్రామ‌స్తులు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. మాఫియా వీరిని బెదిరించి లోడ్ వాహ‌నాల‌ను వారిపైకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అడ్డు త‌ప్పుకోవ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. అక్ర‌మ ఇసుక ర‌వాణా విష‌యాన్ని 100 డ‌య‌ల్ కి ఫోన్ చేసి చెప్పినా స్పంద‌న క‌రువైంద‌ని గ్రామ‌స్తులు పేర్కొంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్మ‌క్కు కావ‌డం వ‌ల్ల‌నే ఇసుక మాఫియా రెచ్చిపోతుందంటున్నారు గ్రామ‌స్తులు. అక్ర‌మ ఇసుక ర‌వాణా చేస్తున్న వారు ప‌ట్టుబ‌డితే పీడీ యాక్ట్ కింద కేసులు బుక్ చేయాల‌ని, లేని ప‌క్షంలో గ్రామ‌స్తుల‌మే రంగంలోకి దిగి ఇసుక మాఫియాను ప్రోత్స‌హిస్తున్న వారిపై దాడులు చేసేందుకు సిద్ద‌మ‌వుతామ‌ని గ్రామ‌స్తులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Next Story