గ్రామ కంఠం భూమిని కాపాడండి

by Ratna Kumari |

మండల పరిధిలోని గోకారం గ్రామంలోని గ్రామ కంఠం భూమిని కాపాడాలని సర్పంచ్ పంజుగుల పరుశురాములు గ్రామస్తులతో కలిసి బుధవారం ఎమ్మార్వో ఉమా కి వినతిపత్రం అందజేశారు.

గ్రామ కంఠం భూమిని కాపాడండి
X

దిశ, చారకొండ : మండల పరిధిలోని గోకారం గ్రామంలోని గ్రామ కంఠం భూమిని కాపాడాలని సర్పంచ్ పంజుగుల పరుశురాములు గ్రామస్తులతో కలిసి బుధవారం ఎమ్మార్వో ఉమా కి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన జమ్ముల నగేష్ జమ్ముల నారయ్యలు గ్రామంలోని రోడ్డుకు పక్క ఉన్న భూమి తమదే అంటూ సర్వే నెంబరు 421 సంబంధించిన భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గ్రామ కంఠం భూమి లో ప్రభుత్వ భవనాన్ని నిర్మించేందుకు వీలు లేకుండా చేయడం ఆక్రమించుకోవడమే అవుతుందని అన్నారు. గ్రామ కంఠం భూమిలో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఇండ్ల నిర్మాణం చేపట్టడం చట్ట వ్యతిరేకమని, వెంటనే సంబంధిత అధికారులు గోకారంలోని సర్వేనెంబర్ 421 ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ భూమి అనేది తెలిసి కూడా ఈ విధంగా కబ్జా చేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాలమ్మ రాములు, గ్రామస్తులు కృష్ణుని రామకృష్ణ గుడిపల్లి హరిబాబు గజ శ్రీను లింగం మల్లేష్ బొడ్డుపల్లి కొండల్ జమ్ముల శీను గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story