- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ ఫలితాలలో జలజం విద్యార్థుల విజయ దుందుభి
ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపులలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జలజం జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఫలితాలలో మరోసారి ప్రభంజనం సృష్టించారు.

దిశ, పాలమూరు : ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపులలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జలజం జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఫలితాలలో మరోసారి ప్రభంజనం సృష్టించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హెచ్ఈసీ గ్రూపు విద్యార్థిని హరిణి పూజిత 500 మార్కులకు 490 మార్కులను సాధించింది. ఎంఈసీ విభాగంలో ప్రేమ్ కుమార్ 483, సురగౌని శ్రీ నిత్య 481, ఎం సంతోష్ 476, హెచ్ఈసీ విభాగంలో జి. హాసిని 473, సీఈసీ విభాగంలో MD జీషాన్ 472 మార్కులను సాధించి సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరంలో జి ప్రణవ్ కుమార్ ఎంఈసీ విభాగంలో 1000 మార్కులకు గాను 982 మార్కులు సాధించగా, ఎన్ సాహితీ 977 మార్కులను సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ రమేష్ గౌడ్, ప్రిన్సిపల్ కల్పన, లెక్చరర్లు కుసుమ, జ్యోతి, కృష్ణ, నరేష్, వినోద్, సుమలత, రాణి ప్రత్యేకంగా అభినందించారు.
వచ్చే ఏడాది నుంచి ఏసీఈ గ్రూపు : కరస్పాండెంట్ రమేష్ గౌడ్
ఆర్ట్స్ గ్రూపులలో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సాధించిన తమ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఏసీఈ గ్రూపును ప్రవేశపెడుతున్నామని కళాశాల కరస్పాండెంట్ రమేష్ గౌడ్ వెల్లడించారు.ఈ ఏసిఈ గ్రూప్ CA కోర్సు చేసే విద్యార్థులకు ఒక వరం. ఇప్పటికే ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి గ్రూపులను విజయవంతంగా నిర్వహిస్తూ CA, CMA , CLATలలో విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా ఉండే విధంగా ఏసీఈ గ్రూపును ప్రవేశపెట్టి కళాశాల ఖ్యాతిని మరింత పెంచుతామని రమేష్ గౌడ్ చెప్పారు.






