- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్యూర్ తప్పదు: విజయ్ దేవరకొండ-రష్మిక
విజయ్ దేవరకొండ- రష్మిక దంపతులు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు.

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని 47 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకు సాధించిన 181 మంది విద్యార్థినీ విద్యార్థులకు నటులు విజయ్ దేవరకొండ -రష్మిక దంపతులు నగదు బహుమతిగా అందించారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఆదివారం వారి తల్లిదండ్రులు మాధవి-గోవర్ధన్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ డీఈఓ రమేష్‌తో కలిసి మొదటి ర్యాంకు సాధించిన వారికి 10 వేలు, రెండవ ర్యాంకు సాధించిన వారికి 5 వేల చొప్పున నగదు పారితోషకాన్ని బల్మూరు మండలం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ వద్ద వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అంతకు ముందు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ..
ఉపకార వేతనం ఇవ్వడం సంతోషకరం..
కన్న ఊరును మరవని విజయ్ రష్మిక దంపతులకు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గర్వంగా ఫీల్ అవుతున్నానన్నారు. శ్రీమంతుడు సినిమాలో రీల్ హీరో మహేష్ బాబు అయితే.. రీల్ అండ్ రియల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక లని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వారిది అచ్చంపేట ప్రాంతం కావడం ఈ ప్రాంత కోడలిగా రష్మిక దేవరకొండ కావడం చాలా సంతోషమని.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారు అత్యధికంగా పేద బిడ్డలు ఉంటారని.. వారిని ప్రోత్సహిస్తూ ఉపకార వేతనం ఇవ్వడం సంతోషమన్నారు. అచ్చంపేట వెనుకబడిన ప్రాంతమని విద్యకు ఎంత చేసినా తక్కువేనని ఎంతో కష్టపడి ఉన్న స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ జాతీయస్థాయిలో మంచి పేరు గుర్తింపులు పొందారున్నారు. అచ్చంపేటలో విజయ్ దేవరకొండ దంపతులు ఒక అన్ని హంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ న ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
విజయ్ దేవరకొండ-రష్మికలు మాట్లాడుతూ..
విద్యపైన ప్రతి విద్యార్థి ఫోకస్‌తో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవటం సులభతరం అవుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు మంచి వాతావరణం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నిన్నటి పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో నాగర్కర్నూల్ జిల్లా రెండో స్థానం వచ్చిందంటే జిల్లాలోని ఉపాధ్యాయుల పాత్ర అమోహమన్నారు. ఏది కల్తీ చేయరాదని ప్రపంచంలో అట్లాంటి వ్యవస్థ తయారయిందని గుర్తు చేశారు. జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుంటామని కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి మంచిని నేర్చుకుంటూ ముందుకెళ్లాలని నవ్వుతూ కష్టపడి క్రమశిక్షణతో చదవాలన్నారు. ఇదే ఎవరి వాడిని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అంతకుముందు విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడుతూ.. మా సొంతూరు గట్టు తుమ్మెన్, చిన్న పిల్లల మీద ఉన్న ప్రేమతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇతరుల పట్ల గౌరవం క్రమశిక్షణ, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి విద్యార్థులు అందరూ గర్వపడేలా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మేనేజర్లు కన్నారావు, చాంద్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






