పోలీసు వాహనంపై రీల్స్..అస‌లు విష‌యం ఇదే!

by velandi.Saikiran |

పోలీస్ స్టేషన్ కు సంబంధించిన‌ వాహనంపై ఓ యువకుడు రీల్స్ చేసిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ మారింది

పోలీసు వాహనంపై రీల్స్..అస‌లు విష‌యం ఇదే!
X

దిశ, ఊట్కూర్ : మండల కేంద్ర పోలీస్ స్టేషన్ కు సంబంధించిన‌ వాహనంపై ఓ యువకుడు రీల్స్ చేసిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ మారింది. అయితే ఈ వీడియోపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పాత వీడియోనే, ఇప్పుడు వైర‌ల్ చేస్తున్నార‌ని తేల్చారు. మూడు నెలల కింద‌ పోలీస్ స్టేషన్ పై కప్పు భాగంలో పేరుకుపోయిన చెత్తను తొలగించిన సంఘటనను ఇప్పటి వీడియోలాగా చూపించార‌ని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ సంఘ‌ట‌న‌ను పోలీస్ వాహనంపై కూర్చుని రీల్స్ చేశారని తప్పు దోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు సిఐ రామ్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పాత వీడియోను కొత్తదిగా చూపిస్తూ వైరల్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫేక్ వీడియోను షేర్ చేసినా వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

Next Story