- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్చర్లలో మాటల మంటలు
జడ్చర్ల నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం మాటల తూటాలతో వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మొదలైన విమర్శలు క్రమంగా

దిశ, జడ్చర్ల/నవాబుపేట : జడ్చర్ల నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం మాటల తూటాలతో వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మొదలైన విమర్శలు క్రమంగా వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకోవడంతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు, పరస్పర ఆరోపణలు చేసుకుంటూ నేతలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం నెలకొన్నది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వారి మధ్య ఘర్షణలు జరగడం అనర్థాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయంగా తమ స్థాయిని తామే వారు దిగజార్చుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి మరింత విషమించకుండా ఉండాలంటే ఇరు పార్టీల అధిష్ఠానాలు వెంటనే జోక్యం చేసుకుని నేతలకు సంయమనం పాటించాలని సూచించడంతో పాటు, ప్రజా అంశాలపై హుందాగా చర్చించే రాజకీయ సంస్కృతి అవసరమని పేర్కొంటున్నారు. చివరికి మాటలతో కాదు, ప్రజల కోసం చేసే పనులతోనే నాయకులకు గౌరవం లభిస్తుందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.






