క్షేమంగా దొరికిన బాలుడు రిత్విక్… తల్లిదండ్రుల్లో ఆనందం

by Bhanu |

బుధవారం ఉదయం చెదురుపల్లి గ్రామంలో కలకలం సృష్టించిన బాలుడు అదృశ్యం సుఖాంతమైంది.

క్షేమంగా దొరికిన బాలుడు రిత్విక్… తల్లిదండ్రుల్లో ఆనందం
X

దిశ, వెల్దండ: బుధవారం ఉదయం చెదురుపల్లి గ్రామంలో కలకలం సృష్టించిన బాలుడు అదృశ్యం సుఖాంతమైంది. రిత్విక్ (2) తిరిగి దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పోలే నీలమ్మ, నరేందర్ దంపతుల కుమారులు రిషి, రిత్విక్ లు తాత వెనుక బయటకు వెళ్లారు. కొద్ది సేపటికి రిషి ఒక్కడే ఇంటికి తిరిగి రాగా, రిత్విక్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే వెల్దండ పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి, అనుమానిత ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. చివరకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రిత్విక్ క్షేమంగా కనిపించి, తల్లిదండ్రులకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

బాలుడు అపహరణకు గురయ్యాడా? లేక తప్పిపోయాడా? అనే కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు, ఇది కిడ్నాప్ కాదు, దారి తప్పి వేరే చోటుకు వెళ్లిపోయిన సంఘటన అని తెలిపారు.


Next Story