- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడి పందెంలపై వనపర్తి స్పెషల్ పోలీసుల మెరుపు దాడి
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో కొంతమంది కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు వనపర్తి జిల్లా స్పెషల్ పోలీసులు, గోపాల్ పేట పోలీసులు కలిసి పక్క సమాచారంతో మెరుపు దాడి చేశారు.

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో కొంతమంది కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు వనపర్తి జిల్లా స్పెషల్ పోలీసులు, గోపాల్ పేట పోలీసులు కలిసి పక్క సమాచారంతో మెరుపు దాడి చేశారు. గత మూడు రోజుల నుండి కోళ్ల పందాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఈ దాడిలో వనపర్తి స్పెషల్ సిసిఎస్ సీఐ అశోక్, ఎస్సై తిరుపతి రెడ్డి, ఆరు మంది స్పెషల్ పోలీస్ సిబ్బంది నిర్వహించిన దాడులలో ఏ ఎస్ ఐ తిరుపతిరెడ్డి కోళ్ల పందెం ఆడుతున్న ఒక వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఆ వ్యక్తి దొబ్బడంతో సీసీఎస్ఏఎస్ఐ తిరుపతిరెడ్డి కింద పడడంతో కాళ్లకు,చేతులకు అక్కడక్కడ గీతలు గీసుకు పోయినవని తెలిపారు. వీళ్లను చూసి దాదాపు 20 నుంచి 30 మంది కోళ్ల పందెం ఆడేవారు అడవిలోకి పారిపోయారని వారు తెలిపారు. వారి నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు అదేవిధంగా పాలమూరు రామకృష్ణను,రెండు కోడిపుంజులను పట్టుకున్నట్లు ఏఎస్ఐ తిరుపతి రెడ్డి తెలిపారు. సాయం కోసం గోపాల్పేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






