కళాకారులకు పుట్టినిల్లు వనపర్తి : సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్

by Ratna Kumari |

దిశ, వనపర్తి : కవులకు కళాకారులకు పుట్టినిల్లు వనపర్తి జిల్లా అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో వనపర్తి

కళాకారులకు పుట్టినిల్లు వనపర్తి : సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
X

దిశ, వనపర్తి : కవులకు కళాకారులకు పుట్టినిల్లు వనపర్తి జిల్లా అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో వనపర్తి కళాకారులతో ఇటీవల రూపొందించిన "కావ్య మాలిని" లఘు చిత్ర కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ప్రతిభావంతులైన కళాకారులు ఎంతో మంది ఉన్నారని, సినిమా రంగంలో కూడా చక్కగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ సామాజిక అంశాలతో లఘు చిత్రాలను నిర్మిస్తూ సామాజిక మాధ్యమాలలో మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంతో కావ్య మాలిని లఘు చిత్రం కూడా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నదని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఇలాంటి వారికి అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే చక్కటి స్థాయికి ఎదుగుతారని చెప్పారు. లఘు చిత్ర నటీ నటులు చెన్నపద్మ, శంకరయ్య, కళ్యాణి, విజయ్ డైరెక్టర్, శ్రీమద్, బాలు, నిర్మాత లక్ష్మణ్ నాయుడు, సంజు ల‌ను కళావేదిక పక్షాన సత్కరించారు. ఈ కార్యక్రమంలో కందూరు నారాయణ రెడ్డి, బైరోజు చంద్ర శేఖర్, చెన్న సత్యనారాయణ, ఎం.ఎ. సత్తార్, దేశి రాములు యాదవ్, నిరంజనయ్య, బండారు శ్రీనివాస్, ఉప్పరి తిరుమలేశ్, రామకృష్ణారెడ్డి, రుకునందం అనంతప్ప, రాంరెడ్డి పాల్గొన్నారు.

Next Story