గట్టు మండ‌లంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, గ‌ట్టు : మండ‌ల త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం వాల్మీకి జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌హ‌శీల్దార్ విజ‌య్

గట్టు మండ‌లంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి
X

దిశ‌, గ‌ట్టు : మండ‌ల త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం వాల్మీకి జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త‌హ‌శీల్దార్ విజ‌య్ కుమార్ వాల్మికి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. మండ‌ల కేంద్రంతో పాటు ఆర‌గ‌ద్ద‌, పెంచిక‌ల్ పాడ్, త‌ప్పెట్ల మెర్సు, గోర్ల‌ఖాన్, దొడ్డి మాచ‌ర్ల‌, బ‌ల్హెర‌, ఆలూరు, తుమ్మ‌ల చెరువు, రాయ‌పురం, య‌ల్లందొడ్డి వంటి గ్రామాల్లో వాల్మీకి విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో అన్న‌దాన కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. చేతిరాత‌, ఎద్దుల బండ్ల గిర‌క‌, ప‌లు క్రీడా పోటీ నిర్వ‌హించారు. కొన్ని ప్రాంతాల్లో వాల్మీకి చిత్ర‌ప‌టాన్ని బ్యాండ్ భ‌జ‌న‌తో ఊరేగింపు చేశారు. మండ‌ల ప‌రిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఘ‌నంగా వాల్మీకి మ‌హ‌ర్షి జ‌యంతి వేడుక‌లు జ‌రుపుకున్నారు.

Next Story