వాల్మీకుల‌ను బీసీ నుంచి తొల‌గించి ఎస్టీలో చేర్చాలి : వాల్మీకి కొండయ్య

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, న‌ర్వ : వాల్మికుల‌ను బీసీ (ఏ) నుంచి తొల‌గించి ఎస్టీలో చేర్చాల‌ని బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు వాల్మీకి కొండ‌య్య పేర్కొన్నారు. న‌ర్వ మండ‌ల

వాల్మీకుల‌ను బీసీ నుంచి తొల‌గించి ఎస్టీలో చేర్చాలి : వాల్మీకి కొండయ్య
X

దిశ‌, న‌ర్వ : వాల్మికుల‌ను బీసీ (ఏ) నుంచి తొల‌గించి ఎస్టీలో చేర్చాల‌ని బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు వాల్మీకి కొండ‌య్య పేర్కొన్నారు. న‌ర్వ మండ‌ల కేంద్రంలో ఇవాళ వాల్మీకి అధ్యక్షులు కావలి అయ్యన్న ఆధ్వ‌ర్యంలో వాల్మీకుల బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన వాల్మీకి కొండ‌య్య మాట్లాడుతూ వాల్మీకి బిడ్డ‌లు విద్యా ప‌రంగా ఆర్థికంగా, రాజ‌కీయంగా ఎద‌గాల‌న్నారు. అలాగే రాబోయే స్థానిక ఎన్నిక‌ల‌లో ఏ పార్టీ అయినా వాల్మీకుల‌ను గుర్తించి అధిక సీట్లు కేటాయించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వాల్మికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్వి నిరాజ్, గ‌డ్డంప‌ల్లి హ‌న్మంతు, మాజీ ఎంపీపీ ఉపాధ్య‌క్షుడు గ‌డ్డం న‌ర‌సింహ‌, ఉమాప‌తిఇ, సుధీర్, న‌ర్వ మండ‌ల సింగిల్ విండో వైస్ చైర్మ‌న్ ల‌క్మ‌ణ్, నాయ‌కులు భ‌గ‌వంత్, వెంక‌టేష్ పాల్గొన్నారు.

Next Story