- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
దిశ, పాన్ గల్ : మండలంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని బండపల్లి, రాయినిపల్లి,

దిశ, పాన్ గల్ : మండలంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని బండపల్లి, రాయినిపల్లి, కేతెపల్లి గ్రామాల్లో వాల్మీకి మహర్షి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బండ్లపల్లిలోని వాల్మికి మహర్షి విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు రామ్మూర్తి నాయుడు, వేణుగోపాల్ నాయుడు, నీల స్వామి నాయుడు, కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్, ఐక్య వాల్మీకి సంఘం మండల అధ్యక్షుడు నరసింహనాయుడు, వెంకటయ్య నాయుడు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ గ్రంథాన్ని రచించి లోకానికి పరిచయం చేసిన మహనీయుడని వారు కొనియాడారు వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఐక్యవాల్మీకి నాయకులు తిరుపతయ్య నాయుడు శేషయ్య నాయుడు మాజీ సర్పంచ్ నాగేశ్వర్ నాయుడు దశరథ నాయుడు ఆంజనేయులు పాల్గొన్నారు.






