5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని గీసిన 6వ తరగతి విద్యార్థిని

by Kodari Anjali |

మన్ననూరు గ్రామానికి చెందిన సంబు శోభ వెంకటరమణ మనుమరాలు వైష్ణవి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని గీసింది.

5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని గీసిన 6వ తరగతి విద్యార్థిని
X

దిశ, అమ్రాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన సంబు శోభ వెంకటరమణ మనుమరాలు వైష్ణవి ఆరవ తరగతి చదువుతుంది. చిన్న వయసులోనే అసాధారణ చిత్రలేఖన ప్రతిభను కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆరవ తరగతి విద్యార్థిని కుమారి సంబు వైష్ణవి.. చిన్నప్పటి నుంచే ఏ చిత్రాన్ని చూసినా దానిని కాగితంపై అచ్చుగుద్దినట్లుగా గీయడం ఆమె ప్రత్యేకత. మూడో తరగతి నుంచే జాతీయ నాయకులు, శ్రీరాముడు, సీతాదేవి తదితరుల చిత్రాలను ఎంతో నైపుణ్యంతో గీసి తన ప్రతిభను చాటుకుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఇంటి వద్దకు వచ్చిన సందర్భంగా తీసిన ఫోటోను చూసి, తన రఫ్ నోట్‌బుక్‌లో కేవలం ఐదు నిమిషాల్లోనే పెన్సిల్‌తో అద్భుతంగా చిత్రీకరించింది. ఆ చిత్రాన్ని చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమె ప్రతిభకు ముగ్ధులయ్యారు. వైష్ణవి తల్లిదండ్రులు సంభు సురేష్, స్పందన ఆమెను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ చిత్రలేఖనంపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. అలాగే ఆమె తాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంబు వెంకటరమణ కూడా మనవరాలి ప్రతిభను అభినందిస్తూ అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇలాంటి ప్రతిభను చిన్న వయసులోనే ప్రదర్శిస్తున్న వైష్ణవి, భవిష్యత్తులో గొప్ప చిత్రకారిణిగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.

Next Story