- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీకి చిక్కిన వడ్డేపల్లి సర్వేయర్
భూములకు సంబంధించి ఒక రైతుకు అనుకూలంగా సర్వేలు చేయడానికి రూ 10,000 లంచం తీసుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య ఏసీబీ అధికారులకు చిక్కాడు.

X
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : భూములకు సంబంధించి ఒక రైతుకు అనుకూలంగా సర్వేలు చేయడానికి రూ 10,000 లంచం తీసుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య ఏసీబీ అధికారులకు చిక్కాడు. మండలంలోని ఒక రైతుకు సంబంధించి మొత్తం నాలుగు ఎకరాల పొలం సర్వే చేయడానికి ఎకరాకు 5000 చొప్పున మొత్తం 20,000 ఇవ్వాలి అని సర్వేయర్ బ్రహ్మయ్య రైతుపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అడ్వాన్సుగా 5000 తీసుకున్నాడు. మొత్తం డబ్బులు ఇస్తేనే సర్వే చేస్తానని మొండికి వేయడంతో రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ సారధ్యంలో వెళ్లిన బృందం రైతు నుంచి 10000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కి తరలిస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ దిశ కు తెలిపారు.
Next Story






