- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడ్డేపల్లి రూటే వేరు.. ప్రధాన పార్టీలను పక్కన పెట్టి మరీ..!
వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు నేతృత్వంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

దిశ, అలంపూర్ : గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు నేతృత్వంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా తాము చేసిన నిరంతర ప్రజా సేవకే ప్రజలు పట్టం కట్టారని కొనియాడారు. తాము ఏ పార్టీ మద్దతు కోరలేదని, స్వతహాగా ప్రజల అభీష్టం మేరకే పోటీ చేసి గెలిచామని స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ.. తాము ఎవరి ఫోటోలను వాడుకోలేదని, భవిష్యత్తు కార్యాచరణను కార్యకర్తల సలహా మేరకు నిర్ణయిస్తామని ప్రకటించారు. కవిత వర్గంతో సంబంధం లేదు "తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వర్గంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రచారంలో ఎక్కడా ఆమె ఫోటోను వాడలేదు. జరుగుతున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. టికెట్ల కోసం పాకులాడలేదు "మేము ఏనాడు బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలను టికెట్ల కోసం అడగలేదు. మా బలం ప్రజలే. ప్రస్తుతానికి స్వతంత్రంగానే గెలిచాం. అధికార పార్టీలో చేరాలా వద్దా అనే అంశంపై కార్యకర్తల అభిప్రాయం మేరకు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం" అని మీడియాతో చెప్పుకొచ్చారు.






