- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నట్టల రోగాలు రాకుండా ఉండాలంటే టీకాలు తప్పనిసరి
దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి, బోర్సుగడ్డ తాండ గ్రామాలలో పశువెద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో

దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి, బోర్సుగడ్డ తాండ గ్రామాలలో పశువెద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 3200 గొర్రెలకు, 150 మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశామని పశు వైద్యాధికారి డాక్టర్ జీవిత అన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క గొర్రెల, మేకల కాపరులు ఎన్నో జీవాలు నట్టల రోగాలతో మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉండడంతో అట్టి రోగాలను నిర్మూలించడం కోసం ప్రతి ఒక్క కాపరి జీవాలకు నట్టల నివారణ మందులు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. నట్టల నివారణ మందుల వలన జీవాలలో అంతర పరాన్నజీవులు నిర్మూలించబడి జీవాల బరువు, వ్యాధినిరోధకత శక్తి, ఉత్పాదకత పెరుగుతుందని జీవాల కాపరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారితో పాటు లట్టుపల్లి గ్రామం సర్పంచ్ శివలీల, వైద్య సిబ్బంది ఖాజా, గొర్రెల కాపరులుఉన్నారు.






