న‌వాబుపేట ఎస్సై గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వి.న‌రేంద‌ర్

by Nallavelli.Anjaneyulu |

నవాబుపేట నూతన ఎస్ఐగా నియమితులైన వి. నరేందర్ ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

న‌వాబుపేట ఎస్సై గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వి.న‌రేంద‌ర్
X

దిశ, నవాబుపేట : నవాబుపేట నూతన ఎస్ఐగా నియమితులైన వి. నరేందర్ ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పర్వతాపూర్ మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా తాను ఎస్ఐగా విధులు నిర్వహించి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు విశేషంగా కృషి చేసే శక్తియుక్తులను ప్రసాదించి మంచి పోలీస్ అధికారిగా పేరు ప్రఖ్యాతులు పొందేలా ఆశీర్వదించాలని ఎస్సై నరేందర్ అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ పూజారులు అమ్మవారికి ఆయన పేరున అర్చనలు చేసి.. తీర్థ, ప్రసాదాలను ఆయనకు అందజేసి ఆశీర్వదించారు.

Next Story