జాతీయ ఆహార భద్రత స్కీమును వినియోగించుకోండి

by Ratna Kumari |

మండలంలోని రైతు సోదరులు జాతీయ ఆహార భద్రత స్కీమును సద్వినియోగం చేసుకోవాలని ఎర్రవల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ అన్నారు.

జాతీయ ఆహార భద్రత స్కీమును వినియోగించుకోండి
X

దిశ, ఎర్రవల్లి : మండలంలోని రైతు సోదరులు జాతీయ ఆహార భద్రత స్కీమును సద్వినియోగం చేసుకోవాలని ఎర్రవల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ ఆహార భద్రత పథకం గురించి రైతులకు అవగాహన క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత స్కీములో రైతులకు పురుగుమందులు,సూక్ష్మ పోషకాలలైన వేప నూనె, 13-0-45 పోషకాలు అందుబాటులో ఉన్నాయని వేప కషాయం వాడడం ద్వారా వరి పంటలకు వచ్చే కాండం తోలుచు, రసం పిలుచు పురుగుల గుడ్ల ఉధృతి తగ్గించి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. కావాల్సిన రైతులు వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్పన శంకర్ నాయుడు, నరేష్, వసంత్ కుమార్ రెడ్డి , కృష్ణ, గోపాల్ ,జగదీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శివన్న రైతులు పాల్గొన్నారు.

Next Story