- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొబైల్ యాప్ వినియోగాన్ని అమలు చేసి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
గ్రామ స్థాయిలో మీసేవా సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేసి దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : గ్రామ స్థాయిలో మీసేవా సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేసి దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసి సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, జీపీవోలకు మీసేవా సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీసేవా కేంద్రాల్లో స్వీకరించే దరఖాస్తులను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొంచిన మీసేవ ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్‌ను అధికారులు సమర్థవంతంగా వినియోగించాలన్నారు. దరఖాస్తుదారుల నివాసానికి వెళ్లి క్షేత్రస్థాయిలో వివరాలను యాప్‌లో నమోదు చేసి,జియో-ట్యాగ్‌తో లైవ్ ఫోటోలు అప్‌లోడ్ చేయడం ద్వారా నకిలీ దరఖాస్తులకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు.
యాప్ ద్వారా నమోదు చేసిన సమాచారం నేరుగా మీసేవా పోర్టల్‌కు అనుసంధానమై తక్షణమే అప్‌డేట్ అవుతుందని వివరించారు. సమర్పించిన దరఖాస్తులు డిప్యూటీ తహశీల్దార్ల స్థాయిలో పరిశీలనకు వెళ్లి, అక్కడ దరఖాస్తుల వివరాలు,పత్రాలను వెరిఫికేషన్ చేసి తుది ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ముఖ్యంగా ఆదాయ, నివాస, కుల, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ధృవపత్రాలు వంటి సేవల దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారం పొందేలా ఈ విధానం దోహదపడుతుందని తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో పరిశీలన నిర్వహించడం వల్ల సేవలు త్వరితగతిన పూర్తవుతూ, పారదర్శకత పెరిగి ప్రజలకు సమయపాలనతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని వివరించారు. ఈ శిక్షణలో భాగంగా యాప్ డౌన్‌లోడ్ విధానం, లాగిన్ ప్రక్రియ, ఫీల్డ్ వెరిఫికేషన్ నమోదు,ఫోటో అప్‌లోడ్,రిపోర్ట్ సమర్పణ తదితర అంశాలపై పిపిటి ద్వారా అవగాహన కల్పించారు. అధికారుల సందేహాలకు వివరణాత్మక సమాధానాలు అందించి, యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివ, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, గ్రామ పరిపాలన అధికారులు పాల్గొన్నారు.






