- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదక ద్రవ్యాల వాడకతో మతిస్థిమితం కోల్పోతారు : ఎస్పీ జానకి
మాదక ద్రవ్యాల వాడకం వల్ల మతి స్థిమితం కోల్పోయి, తమ మీద తమకే నియంత్రణ లేకుండా పోతుందని ఎస్పీ జానకి తెలిపారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మాదక ద్రవ్యాల వాడకం వల్ల మతి స్థిమితం కోల్పోయి, తమ మీద తమకే నియంత్రణ లేకుండా పోతుందని ఎస్పీ జానకి తెలిపారు. సోమవారం స్థానిక జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 'పిల్లల భద్రతకై మాదక ద్రవ్యాల నిర్మూలన' పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేటి సమాజంలో మంచి కన్నా చెడు తొందరగా వ్యాప్తి చెందుతుందని, డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం లాంటి చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వాడకం వల్ల జీవితమే నాశనం అయ్యి, భవిష్యత్తు అంధకారంగా మిగిలిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం తమ లక్ష్యమని, ఎవరైనా డ్రగ్స్ వాడకం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం లాంటి విషయాలు తెలిస్తే 1908 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం 'డ్రగ్స్ కు తామంతా వ్యతిరేకం' అని ఎస్పీ జానకి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో 'ఈగల్ ఫోర్స్' స్టేట్ ఆఫీసర్ కృష్ణమూర్తి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ చంద్రమోహన్ రావు, డా.నరేష్ చంద్ర, డా.పవన్ కుమార్, గిరీష్ మిత్ర, ప్రిన్సిపాల్ డా.కృష్ణమూర్తి పాల్గొన్నారు.






