- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఊర్కొండ లో తప్పని యూరియా కష్టాలు..
-తెల్లవారుజాము నుండే రైతు ఆగ్రో కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు
-రైతు ముసుగులో దళారుల అక్రమ వ్యాపారం
దిశ,ఊర్కొండ : ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు ఎరువులు, విత్తనాల కొనుగోలు విషయాల్లో ఏటా కష్టాలు తప్పడం లేదు. ఓవైపు అధిక ధరలు పెట్టుబడి భారం వెంటాడుతుండగా, మరోవైపు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కొరత కారణంగా గత కొన్ని రోజులుగా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఊర్కొండ మండల కేంద్రంలో రైతు ఆగ్రో కేంద్రం వద్ద యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రో కేంద్రం వద్దకు చేరుకున్నారు. తెల్లారి జాము నుండి యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. చాలీచాలనట్టుగా యూరియా రావడంతో రైతులకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు విడుదల చేశారు. వీటితో పాటు మరింత యూరియా వచ్చే అవకాశం ఉండడంతో వాటికి కూడా టోకెన్లు ఇచ్చినట్లు ఇచ్చారు రైతు ఆగ్రో కేంద్రం నిర్వాహకులు. కాగా గత పది రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతుడడంతో పత్తి, మిరప పంటలకు యూరియా అవసరాల కోసం రైతులు తెల్లవారే సరికే ఫర్టిలైజర్ దుకాణాలు యూరియా స్టాక్ భవనాల వద్ద బారులు తీరుతున్నారు. అయినా కూడా రైతులకు యూరియా బస్తలు దొరకకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు రైతులకు సరిపడ్డ యూరియాను సరఫరా చేసి రైతులకు యూరియా కష్టాల బారి నుండి తప్పించాలని వేడుకుంటున్నారు.
రైతుల ముసుగులో కొందరు దళారుల యూరియా వ్యాపారం..
బస్తా యూరియా దొరికితే చాలు అనుకుంటున్న తరుణంలో కొందరు రైతుల ముసుగులో తమ అధిపత్యాన్ని తమ పలుకుబడిని ఉపయోగించి ఫర్టిలైజర్ డీలర్ల నుండి అధిక మొత్తంలో యూరియా బస్తాలను కొనుగోలు చేసి వారి ఇంటి వద్ద స్టాక్ పెట్టుకోవడంతో పాటు రైతు అవసరాలను ఆసరాగా తీసుకొని తమ వద్ద యూరియా బస్తాలు ఉన్నాయని ఒక్కో బస్తాకు 50 నుండి 100 రూపాయలు అధికంగా తీసుకొని రైతులకు విక్రయిస్తున్నట్లు పలువురు రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
20 మంది తోయూరియా గ్యాంగ్
రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కొరకై పడిగాపులు కాస్తూ తమ పంటలను కాపాడుకోవడానికి పగలనక రాత్రనక ఫర్టిలైజర్ షాప్ల ముందు భారీ మొత్తంలో క్యూలైన్లు కడుతుండగా ఊర్కొండ మండలంలో కొందరు వ్యవసాయం చేయని వ్యక్తులు సుమారు 20 మంది వరకు వ్యక్తులు గ్యాంగ్ ఏర్పడి. ఎక్కడ యూరియా సరఫరా అవుతుందని తెలిసిన ముందుగా ఈ గ్యాంగ్ లోని సభ్యులే తమ భూముల పాస్ పుస్తకాలను. మొదటి వంటలో పెట్టి ఆయా షాపులకు సరఫరా అయ్యే యూరియాను అధిక మొత్తంలో వీరే కొనుగోలు చేసి ఆ తర్వాత రైతులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారులు ఇలాంటి వ్యవసాయం చేయని రైతులను గుర్తించి నిజంగా పంటలు వేసి యూరియా అవసరమున్న రైతులకే యూరియా పంపిణీ చేయాలని రైతులకు అధిక ధరకు యూరియాను అమ్ముతున్న నకిలీ రైతుల పై చర్యలు చేపట్టాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.






