- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియాను యాప్‌లో బుక్ చేసుకోవాలి : ఏఓ నరేందర్
దిశ, మహమ్మదాబాద్ : రైతులు యూరియాను ఇకపై యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని మహమ్మదాబాద్ మండల వ్యవసాయ అధికారి నరేందర్ సూచించారు.

దిశ, మహమ్మదాబాద్ : రైతులు యూరియాను ఇకపై యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని మహమ్మదాబాద్ మండల వ్యవసాయ అధికారి నరేందర్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో యూరియా యాప్ బుకింగ్ విధానంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొని, వ్యవసాయ అధికారులు, ఎరువుల డీలర్లకు యాప్ వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈనెల 20 నుంచి యూరియా యాప్ బుకింగ్ విధానం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. యాప్ ద్వారా బుకింగ్ చేయడం వల్ల ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు, రైతులకు అవసరమైన యూరియా సమయానికి అందుతుందని పేర్కొన్నారు. నకిలీ ఎరువుల సమస్యను నివారించడంతో పాటు, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట పడుతుందని వివరించారు. రైతులు తమ ఆధార్, భూ వివరాలతో యాప్‌లో నమోదు చేసుకొని యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని, అధికారులు, డీలర్లు రైతులకు పూర్తి సహకారం అందించాలని ఏఓ నరేందర్ కోరారు.






