నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా ఆవిష్క‌ర‌ణ

by Ratna Kumari |

జిల్లా కేంద్రంలో ఈనెల 26న ఉద‌యం 10 గంట‌ల‌కు నిర్వ‌హించ‌నున్న టీఆర్ఎస్ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షులు గ‌వినోళ్ల శ్రీనివాస్, ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు చంద్రు ముదిరాజ్ పిలుపునిచ్చారు.

నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా ఆవిష్క‌ర‌ణ
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : జిల్లా కేంద్రంలో ఈనెల 26న ఉద‌యం 10 గంట‌ల‌కు నిర్వ‌హించ‌నున్న టీఆర్ఎస్ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షులు గ‌వినోళ్ల శ్రీనివాస్, ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు చంద్రు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా వారు విలేక‌ర్ల‌తో మాట్లాడారు. నూత‌నంగా ఏర్పాటైన తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీకి జిల్లాలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే జిల్లాలోని 28 గ్రామాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి జూన్ 20 వ‌ర‌కు జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, మండ‌ల కేంద్రాలు, నాలుగు మున్సిపాలిటీల‌లో జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ప్ర‌తి విద్యార్థికి ఉచిత విద్య‌, ప్ర‌తి పేద కుటుంబానికి ఉచిత వైద్యం అందిస్తామ‌ని తెలిపారు. సామాజిక న్యాయం, రైతు సంక్షేమం కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. యువతకు నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే రూ.20 కోట్ల వరకు రుణ సహాయం అందించే విధానాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు. నారాయణ పేట్ పట్టణ ములో ప్రభుత్వ ఆసుపత్రి లేనందునా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆసుపత్రి నిర్మాణం చేయాల‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతు భ‌రోసాను కేవ‌లం రెండు ఎక‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమితంచేయ‌డం రైతుల‌కు అన్యాయం అని విమ‌ర్శించారు. మిగిలిన ఎకరాలకు కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, అనంతరం కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో కొడంగల్ నియోజకవర్గం TRS ఇన్ చార్జి నీలి జనార్దన్, కొత్త పల్లి మండలం అధ్యక్షులు శివ శంకర్, ఖాజీపూర్ వెంకటప్ప ఆశన్ పల్లి నారాయణ రెడ్డి విట్ల పూర్ భీంశప్ప పాల్గొన్నారు.

Next Story