- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొగులయ్యకు కేంద్రమంత్రి సత్కారం
దిశ, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న కిన్నెర వాయిద్యం జానపద కళాకారుడు

దిశ, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న కిన్నెర వాయిద్యం జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యను ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి సోషల్ జస్టిస్ ఎంపోరిమెంట్ శాఖ మంత్రి నారాయణ స్వామి సన్మానం చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఘనంగా గువ్వ బాలరాజు ఆధ్వర్యంలో ముగులయ్య మంత్రిని కలిశారు. కిన్నెర వాయిద్యం గురించి, కుటుంబ నేపథ్యం తదితర అంశాలను మొగులయ్య ద్వారా అడిగి తెలుసుకున్నారు.మొగులయ్య పాడిన పాట మంత్రిని ఆకట్టుకుంది. కిన్నెర తయారు చేసే విధానం కిన్నెరపై ఉన్న చిలక బొమ్మ గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కిన్నెరతో పాట పడడం తాను ఎక్కడ చూడలేదని మంత్రి కితాబిచ్చారు. మొగులయ్య కిన్నెరను ఆడించే విధానాన్ని చూసీ అడిగి తెలుసుకున్నారు. పేద కళాకారుడిని ప్రోత్సాహిస్తున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అవార్డు పొందిన మొగులయ్యను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు






