- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉడికి ఉడకని అన్నం… నీళ్ల చారు.. విద్యార్థుల ఆవేదన
by Ratna Kumari |
దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా అందుతున్నందుకు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా అందుతున్నందుకు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు ఐదు రోజులుగా అన్నం ఉడకకపోవడం, ముద్దలుగా ఉండటం, రాళ్లు–పురుగులు కనిపించడం, త్రాగునీరు నాచుపట్టి పురుగులు రావడం విద్యార్థులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. పలుమార్లు అధికారులకు తెలిపినా చర్యలు లేకపోవడంతో విద్యార్థులు రోడ్డు మీద ధర్నాకు దిగేందుకు సిద్ధమయ్యారు. పరిస్థితిని గ్రహించిన పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను సముదాయించి పంపించారు. స్థానికులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండి అందించాలని అన్నారు.
Next Story






