రాజీలేని పోరాటం ఎస్ఎఫ్ఐ లక్ష్యం : రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నాణ్యమైన విద్య, ఫీజుల పెంపు, సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, కార్పోరేట్ విద్య వంటి సమస్యలపై ఎలాంటి రాజీ లేకుండా పోరాడేది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) మాత్రమే అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ అన్నారు.

రాజీలేని పోరాటం ఎస్ఎఫ్ఐ లక్ష్యం : రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నాణ్యమైన విద్య, ఫీజుల పెంపు, సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, కార్పోరేట్ విద్య వంటి సమస్యలపై ఎలాంటి రాజీ లేకుండా పోరాడేది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) మాత్రమే అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ అన్నారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ 56 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జెండా ఎగురవేసి మాట్లాడారు. ఫెడరేషన్ కోసం ఎందరో వీర మరణం పొందారని, వారి ఆశయాలు కనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందని, అన్ని వర్గాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, భరత్, హేమలత, నవ్య, స్రవంతి, మనిషా, హరిక, ఉమర్ పాల్గొన్నారు.

Next Story