క్షుద్ర పూజలు చేసే ఇద్దరు మహిళలు అరెస్ట్ : ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

by Ratna Kumari |   (  Updated:2025-11-12 11:01:21  IST  )

దిశ, నాగర్ కర్నూల్ : క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం ఎస్పీ కార్యాలయంలో

క్షుద్ర పూజలు చేసే ఇద్దరు మహిళలు అరెస్ట్ : ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
X

దిశ, నాగర్ కర్నూల్ : క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం అంతారం గ్రామానికి చెందిన కొట్ల అలివేల, వికారాబాద్ జిల్లాకు చెందిన అత్తిల్లి అనిత అనే ఇద్దరు మహిళలు కలిసి నాగర్ కర్నూల్ పట్టణంలో తిరుగుతూ మాకు దైవశక్తి ఉందని పూజలు చేస్తామని ప్రజలను నమ్మబలికే వారు. ఇళ్ళ కింద పొలాలలో బంగారు నాణాలు ఉన్నాయని వాటిని తీస్తే మీ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ప్రజలను నమ్మించేవారు.ఈ క్రమంలో నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు. శ్రీపురం గ్రామానికి చెందిన నిరంజన్ వద్ద మూడు లక్షల 50 వేలు వసూలు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఇట్లాంటి వారి మాయ మాటలు విని మోసపోవడమే ప్రజలకు సూచించారు.

Next Story