- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి విక్రయం.. ఇద్దరు అరెస్ట్
కల్వకుర్తి డివిజన్ లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి డివిజన్ లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండున్నర కేజీల గంజాయిత్జో పాటు రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఉర్కొండ పేట గ్రామ శివారులో జడ్చర్ల - కోదాడ హైవే పక్కన గల సూర్యలత స్పిన్నింగ్ మిల్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాగుతో చెట్ల పొదల్లో అనుమానస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కల్వకుర్తి సిఐ నాగార్జున ఆధ్వర్యంలో ఉర్కొండ మండల ఎస్ఐ కృష్ణ దేవా సిబ్బందితో ఆ ఇద్దరి వ్యక్తులను చాక చక్యంగా పట్టుకున్నారు. వారిని విచారించగా. ఒడిశా రాష్ట్రానికి చెందిన లిట్టు మాలిక్(35), అభిమాన్యు మాలిక్(32)గా తెలిపారు. వృత్తి రీత్యా వీరు సూర్యలత స్పిన్నింగ్ మిల్ లో మిషన్ ఆపరేటర్స్ గా పని చేస్తున్నారు. గంజాయి తెలంగాణలో ఎక్కువ ధర పలుకుతుండటంతో వీరిలో ఒకరైన అభిమాన్యు మాలిక్ కు ఈ నెల 17 న తన సొంత రాష్ట్రం ఒడిశా వెళ్తున్నా క్రమంలో 20 వేల నగదును లిట్టు మాలిక్ ఇచ్చి రెండున్నర కేజీల గంజాయి కల్వకుర్తి కి తెప్పించి సూర్యలత స్పిన్నింగ్ మిల్ సమీప పొదల్లో జాగ్రత్త పరిచి అవసరమైనపుడు ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. అదే క్రమంలో మిగితా గంజాయి అమ్మకోవడానికి ప్రయత్నించగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ.59 వేలు ఉంటుందని సీఐ నాగార్జున తెలిపారు. వీరి వద్ద నుంచి రెండున్నర కేజీల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం పరచుకొని వారిని రిమాండ్ కు తరలించామని సీఐ నాగార్జున, ఎస్ఐ కృష్ణ దేవా తెలిపారు. పట్టణ, పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నా, సేవిస్తున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ, ఎస్ఐ కోరారు. గంజాయి విక్రేతలపై కఠినంగా వ్యవహరిస్తామని వారు హెచ్చరించారు. నిందితులను చాక చక్యంగా పట్టుకున్నా ఎస్ఐ కృష్ణ దేవా, కానిస్టేబుల్స్ హర్ష, తిరుపతయ్య, వెంకన్నలను ఎస్పీ సంగ్రం సింగ్ అభినందించారు.






