ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు

by Ratna Kumari |

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి మూడు నామినేషన్లు దాఖలు కాగా గురువారం ఎలిమే సత్యం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు
X

దిశ, కందనూల్ : తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి మూడు నామినేషన్లు దాఖలు కాగా గురువారం ఎలిమే సత్యం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో బిల్ల కంటి హరిబాబు, వాస రమేష్ ఉన్నారని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఎన్నికల కన్వీనర్ మాచిపెద్ది శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31న ఆదివారం ఉదయం పది గంటల నుంచి 5 గంటల వరకు పట్టణ అధ్యక్ష పదవికి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎన్నికల నిర్వహించనున్నట్లు తెలిపారు. 5 గంటల వరకు జరిగే ఎన్నికలలో ఓటర్ లిస్టులో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకుని పట్టణ అధ్యక్ష ఎన్నికకు సహకరించాలని కోరారు.

Next Story