రెండు బైకులు ఢీ.. ఒక‌రికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

దిశ‌, మ‌హ‌మ్మ‌దాబాద్ /గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని జానంపల్లి స్టేజ్ సర్వీస్ రోడ్డుపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైకులు

రెండు బైకులు ఢీ.. ఒక‌రికి తీవ్ర గాయాలు
X

దిశ‌, మ‌హ‌మ్మ‌దాబాద్ /గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని జానంపల్లి స్టేజ్ సర్వీస్ రోడ్డుపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో జానంపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య (42) కుడికాలు విరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న గ్రామస్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన చెన్నయ్యను పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తండ్రి పేరు పెంటయ్యగా గుర్తించిన చెన్నయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో బైక్‌పై ఉన్న వ్యక్తికి స్వల్పంగా తగిలినట్లు సమాచారం.

Next Story