- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు
రెండు బైకులు ఢీకొని ఇద్దరు గాయపడిన సంఘటన గండీడ్ మండల పరిధిలో శనివారం జరిగింది.

X
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్: రెండు బైకులు ఢీకొని ఇద్దరు గాయపడిన సంఘటన గండీడ్ మండల పరిధిలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గండీడ్ మండల పరిధి అంచన్ పల్లి గ్రామానికి చెందిన వడ్డే హనుమంతు, వెన్నచెడు గ్రామానికి చెందిన చెన్నయ్యలు మహబూబ్ నగర్ వెళ్లే మార్గంలో వేర్వేరు బైకులపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కొంరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు వెనుక నుంచి బైకుపై వస్తున్న చెన్నయ్య ముందు వెళ్తున్న హనుమంతు బైకును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హనుమంతుకు కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలైనాయి. చెన్నయ్యకు స్వల్ప గాయలైనాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో హనుమంతును అంబులెన్స్ లో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Next Story






