రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికీ గాయాలు

by Bhanu |

చిన్నంబావి మండలం చిన్నమారు గ్రామ శివారులో ఇద్దరు యువకులు నడుపుతున్న రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికీ గాయాలు
X

దిశ, చిన్నంబావి : చిన్నంబావి మండలం చిన్నమారు గ్రామ శివారులో ఇద్దరు యువకులు నడుపుతున్న రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయికుమార్ (29) తీవ్రంగా గాయపడగా, మణికంఠ (25)కు స్వల్ప గాయాలయ్యాయి. ఢీకొన్న వెంటనే స్థానికులు సమాచారం అందించగా, 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Next Story