- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాధాగాయత్రి మృతి కేసు.. ముస్సోరీ పోలీసుల తీరుపై డీజీపీ సీరియస్!
టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో వెంటవెంటనే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో వెంటవెంటనే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం ముస్సోరీ పోలీసులకు తమ కుమార్తె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. అల్లుడిపై తండ్రి సుధాకర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు శ్రీచరణ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసైతే ఫైల్ చేశారు కానీ.. ఈ విషయమై శ్రీచరణ్ ను విచారణకు పిలవకపోవడం, పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవడంతో.. సుధాకర్ ఉత్తరాఖండ్ డీజీపీని కలిశారు. తన కూతురు అనుమానాస్పద మృతి, భర్త పాత్రపై అనుమానాలు, ముస్సోరీ పోలీసుల తీరుపై తన ఆవేదనను డీజీపీ దీపంసేథ్ కు వివరించారు.
అల్లుడు శ్రీచరణ్ తన కూతురితో పెళ్లైనప్పటి నుంచి వ్యవహరిస్తున్న తీరు, హ్యాండ్ బ్యాగులో ట్రాకర్ పెట్టడం, సడెన్ గా రుషికేశ్, హరిద్వార్ యాత్ర, ముస్సోరీ ప్లాన్ గురించి చెప్పకపోవడం, కూతురు చనిపోయే ముందురోజు అంటే.. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి 1.38 గంటలకు వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సెల్ఫీని అల్లుడు పంపడం వంటి విషయాలను డీజీపీకి తెలిపారు. దయచేసి తమ కూతురి అనుమానాస్పద మృతిపై విచారణ చేసి, నిజానిజాలు తేల్చి, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సుధాకర్ అభ్యర్థనపై స్పందించిన డీజీపీ.. తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వెంటనే శ్రీచరణ్ ను విచారించేందుకు స్పెషల్ టీమ్ ను రంగంలోకి దించారు. ముస్సోరీలో ఏం జరిగింది?, వారిద్దరూ స్టే చేసిన హోమ్ స్టేలో ఆ రాత్రి శ్రీచరణ్ ఏం చేశాడు? నిజంగానే రెడ్ వైన్ తాగారా? రాధాగాయత్రి ముక్కు నుంచి రక్తం రావడానికి కారణమేంటి? అనే విషయాలపై దర్యాప్తు చేయాలని, వెంటనే శ్రీచరణ్ ను విచారణకు పిలిపించాలని పోలీసులను ఆదేశించారు.






