వేరు వేరు చోట్ల రెండు ప్రమాదాలు.. ఒకరు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు

by Bhanu |   (  Updated:2025-06-20 15:29:27  IST  )

మాగనూర్ మండల కేంద్రం పరిధిలో రెండు వేరువేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

వేరు వేరు చోట్ల రెండు ప్రమాదాలు.. ఒకరు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, మాగనూర్ : మాగనూర్ మండల కేంద్రం పరిధిలో రెండు వేరువేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడచూర్ కంపెనీ నుండి ఖాళీ సిలిండర్లతో హైదరాబాద్ వెళుతున్న బులోరా వాహనం రాయచూరుకు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటన మాగనూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై అభిషేక్ దాబా సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. మక్తల్ నుండి రాయచూర్ కు వెళ్తున్న కారులో ఉన్న వరలక్ష్మి (60 )అక్కడికక్కడే మృతి చెందింది.

కారులో ఉన్న ముగ్గురికి విష్ణు, వినోద్ కుమార్ రాజేష్ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన 15 నిమిషాల వ్యవధిలోనే బైకును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయపడిన ఘటన మాగనూరు మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం పరిధిలో జరిగింది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో బైక్ పై వెళుతున్న కృష్ణా మండలం మురాల్ దొడ్డి గ్రామానికి చెందిన ముకుంద(40) నర్మద (35) అక్షయ్ ( 14) తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం టిప్పర్ ను వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. బాధితుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story