జ‌ర్న‌లిస్ట్ ల స‌మ‌స్య‌ల‌పై ఎలాంటి పోరాటాల‌కైనా సిద్ధం : టీయూడ‌బ్ల్యూజే రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధుగౌడ్

by Ratna Kumari |

దిశ, కొల్లాపూర్ : జర్నలిస్టుల సమస్యల్లో ప్రధానంగా ఇండ్ల స్థలాల విషయంలో ఎలాంటి పొరాటాలకైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీయుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి జి. మధుగౌడ్ స్పష్టం చేశారు.

జ‌ర్న‌లిస్ట్ ల స‌మ‌స్య‌ల‌పై ఎలాంటి పోరాటాల‌కైనా సిద్ధం : టీయూడ‌బ్ల్యూజే రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధుగౌడ్
X

దిశ, కొల్లాపూర్ : జర్నలిస్టుల సమస్యల్లో ప్రధానంగా ఇండ్ల స్థలాల విషయంలో ఎలాంటి పొరాటాలకైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీయుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి జి. మధుగౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన పాలమూరు ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర జాతీయ కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి. విజయ్ కుమార్ అధ్యక్షత వహించగా కార్యదర్శి ఆర్, సురేష్ కుమార్ ఆహూతులకు స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా జి, మధుగౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జి మధుగౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల హెల్త్ కార్డులకు సంబంధించి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల కృషితో ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమై ఒక తీపి కబురు జర్నలిస్టులకు అందనుంది అన్నారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో నియమ, నిబంధనల విషయంలో స్పష్టత వచ్చిందని, త్వరలోనే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు ఇండ్లు సాధించే విషయంలో ఎలాంటి పోరాటాలకైనా జర్నలిస్టులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో టియుడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వాల కార్యక్రమాల నిర్వహణలోను దూసుకుపోతోందని చెప్పారు. ఇదే స్థాయిలో జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కార దిశగా మనమందరం ముందడుగు వేయాలని ఆయన కోరారు.

నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులపై జరిగే దాడులు ఇతర అంశాలపై ఆందోళనలు చేయ‌వ‌లిసి వచ్చినప్పుడు ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర కమిటీ తగు సూచనలు చేసి ఏకతాటి పై జరిగేలా చూడాలని సూచించారు. గద్వాల, వనపర్తి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ యూనియన్ పటిష్టత కోసం ఇతర అంశాలపై ఆయా జిల్లాలలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా నూతనంగా జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపికైన గోలి సుదర్శన్ రెడ్డి, కర్ణయ్య కుమార్,మాల్యల బాలస్వామి, ప్రశాంత్, శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసులు ను సన్మానించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. జిల్లా కౌన్సిల్ సభ్యులు. ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు. పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ వర్గ అధ్యక్షుడు మాలే రాజేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో జిల్లా కార్యదర్శి ఆర్ సురేష్ కుమార్ త్రైమాసిక కార్యక్రమాల నివేదిక సమర్పించారు. జిల్లా కేంద్రంలో ప్రధాన భూమిక పోషించిన రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ కు జిల్లా జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Next Story